Hair Loss: మహారాష్ట్రలో వారం రోజుల్లోనే బట్టతల.. జుట్టురాలే సమస్యతో బాధపడుతున్న ఆ గ్రామాలు, కారణం అదేనా..?
ఈ వార్తాకథనం ఏంటి
జుట్టు రాలడం అనేది ఎంత పెద్ద సమస్య అనేది.. అది అనుభవించేవారికే తెలుస్తుంది.
కొందరు జుట్టు రాలడం చూసి భయపడుతూ ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకుంటారు.
మరికొందరు షాంపూలు, హెయిర్ ఆయిల్స్ మారుస్తూ ఉంటారు. అలాగే, రకరకాల గృహచిట్కాలను ప్రయత్నించే వారు కూడా ఉంటారు.
జుట్టు ఊడిపోవడం మొదలైన తర్వాత ఆగకుండా బట్టతల వస్తుంది. పూర్తిగా బట్టతల అయిన వారు విగ్గులు ఉపయోగించుకోవడమో, లేదా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడమో చేస్తారు.
అయితే, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కాబట్టి చాలామంది దాన్ని చేయలేకపోతున్నారు.
ఈ పరిస్థితిలో, బట్టతలతోనే జీవించడానికి ఇతర మార్గాలను అన్వేషించాల్సి వస్తోంది.
వివరాలు
వారం రోజుల్లోనే వ్యక్తిని పూర్తిగా బట్టతల
ఇటీవల, మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా లోని మూడు గ్రామాల ప్రజలు ఈ సమస్యతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వీరిలో జుట్టు రాలే సమస్య దాదాపు వారం రోజుల్లోనే వ్యక్తిని పూర్తిగా బట్టతలగా మారుస్తోంది.
ఈ సమస్య కారణంగా బోర్గావా, కల్వాడ్, హింగ్నా గ్రామాల్లో ప్రజలందరిలో భయాందోళనలు నెలకొన్నాయి.
చిన్నా, పెద్దా, ముసలి, యువత, మహిళా, పురుషులు అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు.
వివరాలు
దాదాపు 50 మంది వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు
ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర వైద్యశాఖ ఉన్నతాధికారులు ఈ గ్రామాలను సందర్శించి, బాధితులను పరిశీలించారు.
బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకొని వాటిని ప్రయోగశాలలో పరీక్షలు చేయించేందుకు పంపించారు.
అధికంగా జుట్టు రాలడానికి ప్రాథమిక కారణంగా కలుషితమైన నీరు, ఆరోగ్య సమస్యలను గుర్తిస్తున్నారు. అందుకే నీటి నమూనాలు, జుట్టు, చర్మ శాంపిల్స్ పరీక్షల కోసం తీసుకున్నారు.
ఇప్పటి వరకు ఈ మూడు గ్రామాల్లో దాదాపు 50 మంది వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
అయితే, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
త్వరలోనే ఈ సమస్యకు పూర్తి కారణం ఏమిటి, దానికి పరిష్కారం ఎలా తీసుకురావాలో ఆవిష్కరించనున్నారు.