Page Loader
బస్సులో మంటలు చెలరేగి 25మంది మృతి; ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం
బస్సులో మంటలు చెలరేగి 25మంది మృతి; ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం

బస్సులో మంటలు చెలరేగి 25మంది మృతి; ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం

వ్రాసిన వారు Stalin
Jul 01, 2023
08:04 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే(సమృద్ధి మహామార్గ్)పై ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగడంతో 25 మంది మరణించారు. దాదాపు 8మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. యవత్మాల్ నుంచి పూణె వెళ్తున్న బస్సులో ఈ ప్రమాదం జరిగింది. బుల్దానా జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగినట్లు డీఎస్పీ బాబూరావు మహాముని చెప్పారు. బస్సు నుంచి ఇప్పటికే 25 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని బుల్దానా సివిల్ ఆసుపత్రికి తలించారు. బస్సు డ్రైవర్ సురక్షితంగా ఉన్నట్లు బుల్దానా ఎస్పీ సునీల్ కడసానే తెలిపారు. బస్సులో మంటలు చెలరేగిన తర్వాత టైరు పగిలి వాహనం బోల్తా పడిందని బుల్దానా సునీల్ కడసానే వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు