అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా?
మహారాష్ట్ర మరో రాజకీయ కుదుపునకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అజిత్ పవార్ తన వర్గం ఏడుగురు ఎమ్మెల్యేలతో కలిసి అదృశ్యం కావడం కావడం, ఇదే సమయంలో మహారాష్ట్ర సీఎం షిండే అయోధ్యకు వెళ్లనుండటంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అజిత్ పవార్ అయోధ్య కేంద్రంగా బీజేపీతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను ఎన్సీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అజిత్ పవార్ శనివారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఆయన పుణెలోనే ఉన్నారని చెబుతున్నారు.
అజిత్ పవార్‌కు పార్టీ మారడం కొత్తేం కాదు
పూణేలో శుక్రవారం, శనివారాల్లో జరగాల్సిన అన్ని అధికారిక కార్యక్రమాలను అజిత్ పవార్ ఆకస్మీకరంగా రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఆయన ఏడుగురు ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ మారడానికి సిద్ధం ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆదివారం అయోధ్యలో పర్యటిస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేని కలిసేందుకు అక్కడికి వెళ్లి ఉండవచ్చని కొందరు చెబుతున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్‌కు పార్టీ మారడం కొత్తేమీ కాదు. 2019లో కూడా మహా వికాస్ అఘాడీ కూటిమిపై తిరుగుబాటు చేసి బీజేపీతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించారు. శరద్ పవార్ మంత్రాంగంతో తిరిగి బీజేపీని వీడి తిరిగి ఎన్సీపీలో చేరారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి