తదుపరి వార్తా కథనం
Nandipet: మహాశివరాత్రి ప్రత్యేకం.. 9 అంతస్తుల గోపురం, నవనాథుల మహిమ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 26, 2025
10:17 am
ఈ వార్తాకథనం ఏంటి
నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లోని నవనాథుల స్తూపం మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా ముస్తాబైంది.
పలుగుట్ట ప్రాంతంలోని కేదారేశ్వరాలయ ప్రాంగణంలో ఈ స్తూపం ఎంతో ప్రత్యేకత కలిగినది. ఆలయ వ్యవస్థాపకులు రాములు మహరాజ్ 2006లో 9 అంతస్తుల గోపురాన్ని నిర్మించి, ఒక్కో అంతస్తులో ఒక్కో సిద్ధిని ప్రతిష్ఠించారు.
భక్తుల విశ్వాసం ప్రకారం, నవనాథులుగా పేరుగాంచిన మత్స్యేంద్రనాథ్, గోరక్షనాథ్, జలందర్‌నాథ్, కాంతనాథ్, గహినీనాథ్, భర్తృహరినాథ్, రేవణనాథ్, నాగనాథ్, చర్పటనాథ్‌లు శరీర సాధన (ఆసనాలు, ప్రాణాయామం) ద్వారా మోక్షాన్ని సాధించినట్లు చెబుతారు.
ప్రతేడాది మహాశివరాత్రి వేళ ఈ పవిత్ర స్తూపాన్ని వేలాది మంది భక్తులు సందర్శిస్తారు.