LOADING...
AP Govt: సీపీఎస్ ఉద్యోగులకు భారీ ఊరట.. ఫ్యామిలీ పెన్షన్‌కు ఏపీ క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్
సీపీఎస్ ఉద్యోగులకు భారీ ఊరట.. ఫ్యామిలీ పెన్షన్‌కు ఏపీ క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్

AP Govt: సీపీఎస్ ఉద్యోగులకు భారీ ఊరట.. ఫ్యామిలీ పెన్షన్‌కు ఏపీ క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2026
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వెటరన్, ఫ్యామిలీ సీపీఎస్ కంట్రిబ్యూషన్‌కు సంబంధించి నెలకొన్న అనిశ్చితిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల గ్రాట్యుటీ ప్రాతిపదికన కుటుంబ పెన్షన్ (ఫ్యామిలీ పెన్షన్) మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ కీలక సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 వేల మంది సీపీఎస్ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. దీర్ఘకాలంగా ఉద్యోగ సంఘాలు కోరుతున్న అంశంపై సానుకూల నిర్ణయం రావడం పట్ల ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు

భవిష్యత్తులో మరింత భరోసా

అలాగే ఓఎం నంబర్ 57 అమలుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ స్వాగతించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సీపీఎస్ ఉద్యోగులు, వారి కుటుంబాలకు భవిష్యత్‌లో మరింత భరోసా కల్పిస్తుందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement