
Graduate MLC Results 2024: నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న విజయం
ఈ వార్తాకథనం ఏంటి
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్రంలో మే 27న జరిగిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ముగిసింది.
బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఏ రౌండ్‌లోనూ పోటీ ఇవ్వలేకపోయారు. చివరకు రాకేశ్ రెడ్డి ఎలిమినేషన్ కావడంతోనే తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమైంది.
అత్యధిక ఓట్లు సాధించిన తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించారు రిటర్నింగ్ అధికారి.
Details
కాంగ్రెస్ నేతలు సంబరాలు
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై మల్లన్న విజయం సాధించారు.
ఈ ఎన్నికలో పోటీచేసిన బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ కుమార్, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ప్రాధాన్యత ఓట్లు తక్కువగా రావడంతో ఎలిమినేషన్‌కి గురయ్యారు.
శుక్రవారం రాత్రి వరకు సాగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం సాధించారు.
తీన్మార్ మల్లన్న విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటమిని అంగీకరించారు. అయితే నైతిక విజయం తనదేనని ఆయన చెప్పుకొన్నారు.