Mamata Banerjee: భవానీపూర్‌లో సువేందు అధికారి చేతిలో మమతా ఓటమి
వ్రాసిన వారు
Sirish Praharaju
May 04, 2026
10:29 pm
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెద్ద మలుపు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపుర్ నియోజకవర్గంలో అనూహ్యంగా ఓటమి చెందారు. ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సువేందు అధికారి ఆమెపై 15 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే బీజేపీ దూకుడు స్పష్టంగా కనిపించింది. మొత్తం 200కుపైగా స్థానాల్లో విజయాన్ని సాధించి ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు కేవలం 72 స్థానాల్లోనే గెలుపొందింది. అదనంగా మరో 7 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 2021లోనూ మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించిన విషయం తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మమతా బెనర్జీకి షాక్.. భవానీపుర్‌లో ఓటమి
BJP's Suvendu Adhikari wins Bhabanipur by 15,105 votes defeating Bengal CM Mamata Banerjee: EC website. pic.twitter.com/xxNjjgZ7vs
— Press Trust of India (@PTI_News) May 4, 2026