Page Loader
Mamata Banerjee: "నిరాహారదీక్షను విరమించండి".. అల్టిమేటం తర్వాత జూడాలకు సీఎం మమత ఫోన్ 
"నిరాహారదీక్షను విరమించండి".. అల్టిమేటం తర్వాత జూడాలకు సీఎం మమత ఫోన్

Mamata Banerjee: "నిరాహారదీక్షను విరమించండి".. అల్టిమేటం తర్వాత జూడాలకు సీఎం మమత ఫోన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2024
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ఒక వైద్యురాలిపై జరిగిన హత్యాచారం దేశాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరగుతున్నాయి. తాజాగా, వైద్యుల భద్రతను పెంచాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి మద్దతుగా సీనియర్ డాక్టర్లు కూడా రాజీనామాలు సమర్పించారు, అయితే ప్రభుత్వం ఈ రాజీనామాలను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూనియర్ వైద్యుల దీక్షపై స్పందించారు. వైద్యులు తమ దీక్షను విరమించాలని,వారి నిరసనల కారణంగా పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభావం పడుతుందని తెలిపారు.

వివరాలు 

డిమాండ్లకు 4 నెలలు సమయమివ్వాలని మమతా వినతి

ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందని, అయితే వైద్య సేవలపై ప్రభావం ఉండకూడదని చెప్పారు. వైద్యుల డిమాండ్లలో కొన్ని ఇప్పటికే నెరవేర్చామని,మిగతా వాటికోసం 3-4 నెలల సమయం ఇవ్వాలని మమత కోరారు. ఈ విషయంపై చర్చించేందుకు మరోసారి చర్చలకు రావాలని ఆహ్వానించారు. మమత, జూనియర్ డాక్టర్లు సోమవారం (21-10-2024) ప్రభుత్వం తో చర్చలు జరిపేందుకు రాయాలని మరల ఆహ్వానించారు. ఆర్‌జీ కర్ ఆసుపత్రి దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ వైద్యుల వేదిక దగ్గరకు శనివారం చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వెళ్లారు. ఈ సమయంలో సీఎం వైద్యులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. వైద్యులు చేసిన పలు డిమాండ్లను నెరవేర్చేందుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

వివరాలు 

బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు

ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత ఘోరంగా హత్యాచారం జరిగింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగించారు. సీఎం మమతా బెనర్జీ తమ డిమాండ్లను నెరవేర్చేందుకు హామీ ఇవ్వడంతో, 42 రోజుల పాటు కొనసాగిన నిరసనలు విరమించి గత నెల 21న పాక్షికంగా విధుల్లో చేరారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల చర్యలు లేని కారణంగా వారు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.