LOADING...
Ghaziabad: టీ చేయడం ఆలస్యమైందని.. భార్య తల నరికిన భర్త 
Ghaziabad: టీ చేయడం ఆలస్యమైందని.. భార్య తల నరికిన భర్త

Ghaziabad: టీ చేయడం ఆలస్యమైందని.. భార్య తల నరికిన భర్త 

వ్రాసిన వారు Stalin
Dec 20, 2023
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. టీ ఇవ్వడం ఆలస్యమైందన్న నెపంతో ఓ వ్యక్తి తన భార్య తల నరికి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ధరమ్‌వీర్‌గా, మృతి చెందిన మహిళను సుందరిగా పోలీసులు గుర్తించారు. బుధవారం ఉదయం ధరమ్‌వీర్ తన భార్య సుందరిని టీ అడిగాడు. అయితే టీ సిద్ధం చేయడానికి కొంత సమయం పడుతుందని ఆమె చెప్పగా.. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ధరమ్‌వీర్..కత్తితో సుందరి తల నరికేశాడు. మహిళ కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి చూడగా.. సుందరి రక్తపుమడుగులో పడి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిందితుడు ధరమ్‌వీర్‌గా, బాధితురాలు సుందరిగా గుర్తింపు