Page Loader
Delhi: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి 
Delhi: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Delhi: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి 

వ్రాసిన వారు Stalin
Apr 13, 2024
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రేటర్ నోయిడా పోలీస్ స్టేషన్ బీటా-2 ప్రాంతంలోని ప్యారీ చౌక్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. బైక్ నడుపుతున్న సురేంద్ర సింగ్(28),అతని ఇద్దరు సోదరీమణులు శైలి(26),అన్షు(14) మరణించారు. కాగా మరో మహిళ సిమ్మి కు తీవ్రగాయాలయ్యాయి. ఈ నలుగురు కస్నాలో ఓ వివాహ వేడుకకు వెళ్లి బైక్‌పై నోయిడాలోని కులేసరకి తిరిగి వస్తున్నారు. ప్రమాదం అనంతరం ,సురేందర్, అతని సోదరీమణులు శైలి, అను మృతిచెందగా.. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Details 

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు

ఈ ఘటనతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండడంతో పాటు బంధువులు కూడా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తు తెలియని డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివ్ సింగ్ తన కుటుంబంతో కలిసి ఎకోటెక్-3 పోలీస్ స్టేషన్‌లోని కులేసర గ్రామంలోని మధుబన్ విహార్ కాలనీలో నివసిస్తున్నాడు. పారిశ్రామికవాడలోని బల్బుల తయారీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. గురువారం తన కుమారుడు సురేంద్ర సింగ్ తన సోదరీమణులు శైలీ, అన్షుతో కలిసి బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కస్నాకు వెళ్లారు.

Details 

ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన బైక్ 

వివాహం తర్వాత, రాత్రి 2.30 గంటల సమయంలో,సురేంద్ర సింగ్ తన స్ప్లెండర్ బైక్‌పై తన ఇద్దరు సోదరీమణులతో ఇంటికి వస్తుండగా,అదే సమయంలో శైలీ కూడా వారితో కలిసి వస్తా అనడంతో వారు నలుగురూ ఎలాగో బైక్‌పై ఇంటికి బయలుదేరారు . తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పారి చౌక్ సమీపంలో సురేంద్ర సింగ్ బైక్‌ను గుర్తు తెలియని పెద్ద వాహనం ఢీకొట్టింది. దీంతో అందరూ తీవ్రంగా గాయపడ్డారు. అంతే కాదు ఈ ప్రమాదంలో బైక్ చాలా దూరం ఈడ్చుకెళ్లడంతో బైక్ పూర్తిగా ధ్వంసమైంది.

Details 

శుక్రవారం మధ్యాహ్నం సురేంద్ర సింగ్ మృతి

ఈ ప్రమాదంలో శైలి, అన్షు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన సురేంద్ర సింగ్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం సురేంద్ర సింగ్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో శివ సింగ్ తన ముగ్గురు పిల్లలను కోల్పోయాడు. ఇప్పుడు గ్రేటర్ నోయిడాలోని కాలేజీలో చదువుతున్న అతని చిన్న కొడుకు శివం మాత్రమే మిగిలాడు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.