Page Loader
గురుగ్రామ్: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో యువతిని కత్తితో పొడిచి హత్య 
పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన్న కోపంతో యువతిని కత్తితో పొడిచి హత్య

గురుగ్రామ్: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో యువతిని కత్తితో పొడిచి హత్య 

వ్రాసిన వారు Stalin
Jul 10, 2023
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన్న కోపంతో యువతిని పొడిచి హత్య చేశాడు ఓ వ్యక్తి. అతడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని 23 ఏళ్ల రాజ్‌కుమార్‌గా గుర్తించారు. అతను ఉద్యోగ్ విహార్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో హౌస్‌కీపర్‌గా పనిచేస్తున్నారు. మృతురాలిని 19 ఏళ్ల నేహాగా గుర్తించారు. ఆమె ఒక ఇంటిలో పని చేస్తుంది. ఇద్దరూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందినవారు. ప్రస్తుతం గురుగ్రామ్‌లోని ముల్లాహెరా గ్రామంలో నివసిస్తున్నారు. వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అయితే బాధితురాలు పెళ్లిని నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తన తల్లితో కలిసి సోమవారం మధ్యాహ్నం రోడ్డుపై వెళ్తుండగా, రాజ్ కుమార్ దాడి చేసినట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం