Uttar Pradesh: న్యూఇయర్ వేళ ఘోర ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని అందరూ సంతోషంగా గడుపుతున్న వేళ, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి తన కుటుంబాన్ని అత్యంత క్రూరంగా హత్య చేశాడు.ఈ దారుణం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లఖ్‌నవూలోని నాకా ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌లో బుధవారం ఉదయం వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన ప్రకారం,ప్రాథమిక ఆధారాల మేరకు నిందితుడు 24 ఏళ్ల అర్షద్‌గా గుర్తించారు.
వివరాలు
పోలీసుల అదుపులో నిందితుడి
అతడు ఒక హోటల్ గదిలో తన తల్లి, 19, 18, 16, 9ఏళ్ల వయసుల నలుగురు చెల్లెళ్లను కడతేర్చాడు.
ఈ హత్య జరిగిన తర్వాత,నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఆ కుటుంబం ఆగ్రా నుంచి వచ్చారని, వారు ఆ హోటల్‌కు ఎందుకు వెళ్లారనేది విచారణలో భాగంగా తెలుసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబంలో నెలకొన్న గొడవల వల్లే ఈ హత్యలు జరిగాయని ప్రాథమికంగా తెలియవచ్చింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది.