LOADING...
Manchu Manoj: మోహన్‌బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులపై విద్యార్థుల ఆందోళన.. స్పందించిన మంచు మనోజ్
మోహన్‌బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులపై విద్యార్థుల ఆందోళన.. స్పందించిన మంచు మనోజ్

Manchu Manoj: మోహన్‌బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులపై విద్యార్థుల ఆందోళన.. స్పందించిన మంచు మనోజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2024
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

మోహన్‌బాబుకు చెందిన యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఏఐసీటీసీ కి లేఖ రాసింది. విద్యార్థుల ఆందోళనపై మంచు మనోజ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను తన తండ్రి, ఛాన్స్‌లర్‌ మోహన్‌ బాబు దృష్టికి తీసుకెళ్తానని, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఏఐఎస్ఎఫ్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ అంశంపై వెంటనే యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్‌ను వివరణ కోరినట్లు మంచు మనోజ్‌ తెలిపారు. రాయలసీమ విద్యార్థుల ప్రయోజనాలకే మోహన్‌బాబు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు.

Advertisement