
Pahalgam terror attack: పహల్గామ్ దాడిని సమర్థిస్తూ కర్ణాటక వ్యక్తి పోస్ట్.. కేసు నమోదు, నిందితుడి కోసం గాలింపు..
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది నిరాపరాధి పర్యాటకులు తమ ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడి కాశ్మీర్ అందాల్ని ఆస్వాదించేందుకు వచ్చిన వారిపై దారుణంగా జరగింది.
మతాన్ని అడిగి, హిందువులని గుర్తించి వారిని లక్ష్యంగా చేసుకుని కాల్చిచంపారు. ఈ హత్యాకాండ వెనుక తమ ప్రమేయముందని పాకిస్థాన్ మద్దతుతో పనిచేస్తున్న లష్కరే తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) సంస్థ బాధ్యతను స్వీకరించింది.
ఈ ఘోర ఘటనపై భారత ప్రభుత్వం తక్షణమే ప్రతీకార చర్యలు ప్రారంభించింది.
ఇప్పటికే పాకిస్తాన్‌పై దౌత్యపరంగా చర్యలు తీసుకుంటూ, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.
అంతేగాక, పాకిస్తాన్‌తో ఉన్న సరిహద్దులను మూసివేసి, దేశంలో ఉన్న పాక్ పౌరులు భారతాన్ని విడిచిపోవాలంటూ అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది.
వివరాలు
'నిచ్చు మంగళూరు' అనే ఫేస్‌బుక్ ఖాతా నుండి పోస్ట్
దేశం అంతా ఈ అమానుష దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా,కొన్ని వర్గాలు మాత్రం ఈ ఘటనకు మద్దతుగా వ్యవహరించడం బాధాకరం.
సోషల్ మీడియాలో కొంతమంది ఈ దాడిని సమర్థించేలా పోస్ట్‌లు పెడుతుండగా,మరికొందరు పాకిస్తాన్ వైఖరికి మద్దతు ఇవ్వడం గమనార్హం.
ఈ నేపథ్యంలో 'నిచ్చు మంగళూరు' అనే ఫేస్‌బుక్ ఖాతా వినియోగదారు చేసిన పోస్టు తీవ్ర వివాదానికి దారితీసింది.
కర్ణాటకలోని మంగళూరులో ఈ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు నగరంలోని ఉల్లాల్ ప్రాంతానికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు,కోనాజే పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేశారు.
వివరాలు
2023లో పాల్ఘర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన కాల్పుల ఘటనతో పోలిక
ఉద్దేశపూర్వకంగా అల్లర్లు చెలరేగేలా చేసే విధంగా పోస్టులు వేయడం,ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రకటనలు ప్రచురించడం వంటి కారణాలపై భారతీయ న్యాయ సంహితా చట్టం-2023లోని సెక్షన్లు 192 ,353(1)(b) కింద అభియోగాలు మోపారు.
అయితే, ఆ పోస్టులో అతడు కాశ్మీర్ దాడిని 2023లో పాల్ఘర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన కాల్పుల ఘటనతో పోల్చాడు.
ఆ ఘటనలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన ఒక అధికారి తన సహోద్యోగితో సహా నలుగురిని కాల్చిచంపిన విషయం తెలిసిందే.
వివరాలు
ప్రొఫైల్ ఫోటో ఆధారంగా అతడిని గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం
బాధితులను కాల్చే ముందు ముస్లింలేనా అని అడిగాడని ఆరోపణలుంటే, అప్పుడే అతడిని ఉరి తీయవలసి వచ్చేదని, అలా జరిగి ఉంటే పహల్గామ్ ఘటన వుండేదే కాదన్న అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్ట్‌ను పెడుతూ కనిపించాడు.
ఈ పోస్టులోని వ్యక్తి ఎవరన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రొఫైల్ ఫోటో ఆధారంగా అతడిని గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.