బీరేన్ సింగ్ రాజీనామాలో నాటకీయ పరిణామాలు.. క్లిష్ట పరిస్థితిలో సీఎంగా కొనసాగుతానని వెల్లడి
మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కుకీ, నాగా, మైతీ సామాజికవర్గం మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇంఫాల్‌లోని బీరేన్ సింగ్ నివాసం వద్ద నాటకీయ పరిణామాలు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో సీఎం అభిమానులు, ఆయన అధికారిక నివాసం వద్ద గుమిగూడారు. బీరేన్ సింగ్ అప్పటికే రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచారు. అయితే సింగ్ పై ఒత్తిడి తెచ్చిన పార్టీ శ్రేణులు, దానిని చింపేశాలా ప్రొద్భలం చేశారు. గత కొంతకాలంగా ఆందోళనకారుల అల్లర్లు, నిరసనల జోరుతో మణిపూర్ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది.
రాజీనామా చేయకూడదని పట్టుబట్టిన అభిమానులు, శ్రేణులు
సీఎం పదవికి బీరేన్ సింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయకూడదని, అభిమానులు, శ్రేణులు భారీ నిరసన చేపట్టి నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయబోరని పలువురు మహిళా నేతలు బీరేన్ సింగ్ ఇంటి దగ్గర ఉన్న నిరసనవాదులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే సీఎం రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మద్దతుదారులు ఒత్తిడి తెచ్చి సదరు లేఖను చించేశాలా చేశారని సమాచారం. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన నివాసం నుంచి రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లడం ప్రాముఖ్యత సంతరించుకుంది. అనంతరం కొద్దిసేపటికే ఈ విషయంపై బీరేన్ సింగ్ స్పష్టత ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తాను రాజీనామా చేయబోనన్నారు.