Biren Singh: మణిపూర్ సీఎం నివాసంపై ఆందోళనకారుల దాడి.. కర్ఫ్యూ విధింపు
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసంపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనతో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడుల్లో ముఖ్యమంత్రి, ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు నివసించే ఇళ్లపై దాడులు జరిగాయి.
నిరసనకారులు ఇళ్లలోకి చొరబడి ఫర్నిచర్, వాహనాలు, ఇతర సామగ్రిని తగలబెట్టారు.
అల్లర్లు చెలరేగడంతో జిరిబామ్ పట్టణంలో పలు నివాసాలు, రెండు ప్రార్థనా మందిరాలు కూడా నిప్పుపెట్టినట్లు అధికారులు తెలిపారు.
శాంతి భద్రతల కోసం భద్రతా బలగాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి.
Details
ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
అల్లర్ల కారణంగా కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
రాహుల్ గాంధీ ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.