LOADING...
Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదుల పేర్లతో రహదారి.. కఠినంగా స్పందించిన  NGT : ప్రభుత్వానికి తక్షణ ఆదేశాలు
ప్రభుత్వానికి తక్షణ ఆదేశాలు

Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదుల పేర్లతో రహదారి.. కఠినంగా స్పందించిన  NGT : ప్రభుత్వానికి తక్షణ ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 29, 2025
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో గత కొంతకాలంగా కొనసాగుతున్న అస్థిరత మధ్య ఒక విస్తుపోయే ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా, పర్యావరణ సంబంధ అనుమతులు తీసుకోకుండా, ఆరు జిల్లాల అడవుల గుండా ఒక భారీ రింగ్ రోడ్డును నిర్మించినట్లు తేలింది. ఈ అంశంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) తీవ్రంగా స్పందించింది. మణిపూర్ ప్రభుత్వానికి వెంటనే ఆ రోడ్డుపై అన్ని పనులను నిలిపివేయాలని, ఏ ఒక్క అడుగు కూడా ముందుకు కదలకుండా చూడాలని డిసెంబర్ 23న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

వివరాలు 

ఉగ్రవాదుల పేర్లతో రహదారులు 

పిటిషనర్లు NGTకు వివరించినట్లు, కుకీ-జో వర్గం ఈ రోడ్ నిర్మాణంలో నేరుగా పాల్గొన్నదని శాటిలైట్ చిత్రాలు, సోషల్ మీడియా వీడియోలు మరియు ప్రారంభోత్సవ వేడుకల ఆధారాలు సూచిస్తున్నాయి. రోడ్‌కు సంబంధించిన అత్యంత వివాదాస్పద అంశం దాని పేర్లు. స్థానికంగా దీనిని 'జర్మన్ రోడ్' అని, కొంతమంది 'టైగర్ రోడ్' అని పిలుస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 'జర్మన్','టైగర్' అనేవి కుకీ సాయుధ గ్రూపుల కమాండర్ల మారుపేర్లు. ఇలాంటి పెద్ద నిర్మాణాలు అడవీ ప్రాంతాల్లో ఉగ్రవాదుల పేర్లతో చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "రాజ్యాంగ నిబంధనలను పక్కన పెడుతూ, ఉగ్రవాదుల సహకారంతో అక్రమ కారిడార్లు ఎందుకు నిర్మిస్తున్నారని అధికారులు మౌనంగా ఉన్నారు?" అని వారు ప్రశ్నిస్తున్నారు.

వివరాలు 

చొరబాట్లు, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు అడ్డాగా? 

COCOMI,ఇతర వర్గాల అనుమానాల ప్రకారం,ఈ రహదారి కేవలం ప్రయాణానికి కాకుండా,అక్రమ కార్యకలాపాలకు కూడా ప్రధాన మార్గంగా మారింది. మణిపూర్‌లో పరిపాలన సడలిన సమయంలో,ఈ అక్రమ కారిడార్ ద్వారా ఆయుధాల తరలింపు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, సరిహద్దుల దాటే చొరబాటుదారుల ప్రవేశం వంటి కార్యకలాపాలు జరిగే అవకాశముందని బలమైన అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సహకారంతో ఇంఫాల్‌లో నిర్మిస్తున్న రింగ్ రోడ్‌కు ఈ అటవీ రోడ్ ఎలాంటి సంబంధం లేదు. అటవీ శాఖ, గ్రామీణ ఇంజనీరింగ్ శాఖ లేదా పర్యావరణ శాఖ నుండి ఈ రోడ్ కోసం ఎలాంటి NOC లేదా క్లియరెన్స్ ఇవ్వలేదు.

Advertisement

వివరాలు 

చొరబాట్లు, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు అడ్డాగా? 

హోం సెక్రటరీ స్వయంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇలాంటి ఏ రోడ్డును ఆమోదించలేదని, దీనిని అక్రమ నిర్మాణంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చూరాచంద్‌పూర్, కాంగ్‌పోక్పి, నోనీ, ఉఖ్రుల్ వంటి కీలక జిల్లాల ద్వారా కొనసాగుతున్న ఈ రోడ్‌పై 48 గంటల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని NGT ఇప్పటికే ఆదేశించింది. అయితే, ప్రభుత్వం అదనపు సమయం కోరడంతో తదుపరి విచారణను 2026 ఫిబ్రవరి 2కి వాయిదా వేసారు. అప్పటివరకు రహదారిపై ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలని జిల్లా మెజిస్ట్రేట్లు, డీజీపీకి ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement