మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింసాకాండ.. తెల్లవారుజామున కాల్పుల్లో ముగ్గురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లో మరోసారి హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం గుర్తుతెలియని అల్లరిమూకలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తోవైకుకి గ్రామంలో తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కాల్పుల మోతలో ముగ్గురు గ్రామస్తులు చనిపోయారు.మృతులను జామ్‌ఖోగిన్ హాకిప్(26),తంగ్‌ఖోకై హాకిప్ (35),హోలెన్‌సన్ బైట్ (24)గా గుర్తించారు.
లిటన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకీ గ్రామంలో పొద్దున్నే భారీ ఎత్తున కాల్పుల శబ్దాలు వినిపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సమీప గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో తనిఖీలు జరిపినట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే ముగ్గురు యువకుల మృతదేహాలను కనుగొన్నట్లు వెల్లడించారు. ఆయా మృతదేహాలపై తీవ్ర కత్తి గాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు.తాజా ఘటనతో మణిపూర్ వాసులు మరోసారి భయాందోళ చెందుతున్నారు.
details
శాంతిభద్రతల కోసం 40 వేల మంది పారామిలిటరీ దళాలను మోహరించిన కేంద్రం
మైతీ వర్గానికి షెడ్యూల్డ్ తెగ హోదాని వ్యతిరేకిస్తూ కొండ ప్రాంతాల్లో గిరిజనులు(కుకీలు) ఓ యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మే 3న యాత్ర హింసాత్మకంగా మారి ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగాయి.
ఈ క్రమంలో మణిపూర్ రాష్ట్రం అట్టుడికిపోయింది. హింసకాండలో ఈశాన్య రాష్ట్రంలో 120 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటికే అల్లర్ల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3 వేల మందికిపైగా గాయాలపాలయ్యారు.
మారణకాండను కట్టడి చేసి, మణిపూర్ లో శాంతిభద్రతలను సాథారణ స్థితికి తీసుకువచ్చేందుకు పోలీసులతో కలిసి కేంద్ర భద్రతా సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఈ మేరకు దాదాపు 40వేల మంది పారామిలిటరీ దళాలను కేంద్రం మోహరించింది.