NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్ అల్లర్లు : 53 మంది సీబీఐ అధికారుల కేటాయింపు
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్ అల్లర్లు : 53 మంది సీబీఐ అధికారుల కేటాయింపు
    53 మంది సీబీఐ అధికారుల కేటాయింపు

    మణిపూర్ అల్లర్లు : 53 మంది సీబీఐ అధికారుల కేటాయింపు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 17, 2023
    02:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్ రాష్ట్రానికి 53 మంది కేంద్ర దర్యాప్తు బృందం అధికారులను, సీబీఐ(CBI) కేటాయించింది. మారణకాండకు సంబంధించిన కేసులను విచారించేందుకు ఈ నియామకాలను చేపట్టినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

    ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. బృందంలో 29 మంది మహిళలు ఉండటం గమనార్హం.

    బృందంలో ముగ్గురు డీఐజీ స్థాయి అధికారులు లవ్లీ కతియార్, నిర్మలా దేవి, మోహిత్ గుప్తా ఉన్నారు.

    ఎస్పీ స్థాయి అధికారి రాజ్‌వీర్‌లతో కూడిన టీమ్ జాయింట్ డైరెక్టర్(జేడీ) ఘనశ్యామ్ ఉపాధ్యాయ్‌కు నివేదికలు సమర్పిస్తారని వివరించింది.

    ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు అంతా మహిళలే కావడం విశేషం. 16 మంది ఇన్‌స్పెక్టర్లు,10 మంది ఎస్సైలతో సీబీఐ బృందాన్ని ఏర్పాటు చేసింది.

    DETAILS

    దర్యాప్తులో స్థానిక పోలీసుల పాత్రను తగ్గించాం : సీబీఐ

    మరోవైపు భారీ స్థాయిలో మహిళా అధికారులను నియమించడం, ఏకకాలంలో విచారణ జరపడం ఇదే మొదటిసారిగా తెలుస్తోంది.

    అధిక శాతం కేసులు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టానికి సంబంధించినవేనని సమాచారం.

    దర్యాప్తులో పక్షపాతానికి తావులేకుండా లోకల్ పోలీసుల పాత్రను తగ్గించినట్లు సీబీఐ తెలిపింది. ఈశాన్య రాష్ట్రంలోని హింసాకాండపై సీబీఐ ఇప్పటికే 8 కేసులు రిజిస్టర్ చేసింది.

    మే 4న ఓ అల్లరిమూక మహిళలను వివస్త్రను చేసిన ఘటనపై 9 కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే మొత్తం సీబీఐ విచారించే కేసుల సంఖ్య 17కు చేరింది.

    చురచంద్‌పూర్ జిల్లాలో జరిగిన లైంగిక వేధింపుల కేసునూ కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) స్వీకరించనున్నట్లు అధికార వర్గాల భావిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    సీబీఐ

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    మణిపూర్

    మహిళల ఊరేగింపుపై జాతీయ మహిళా కమిషన్ 3 సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు మహిళ
    రణరంగంగా మారిన మణిపూర్.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    Manipur video case: మణిపూర్ వీడియో కేసులో మరొకరు అరెస్టు అత్యాచారం
    Manipur Violence: మణిపూర్‌లో అదేరోజు 40కి.మీ దూరంలో మరో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ గిరిజనులు

    సీబీఐ

    'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025