NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manipur: మణిపూర్ అల్లర్లలో సీబీఐ షాకింగ్ విషయాలు వెల్లడి.. పోలీసులపై తీవ్ర ఆరోపణలు 
    తదుపరి వార్తా కథనం
    Manipur: మణిపూర్ అల్లర్లలో సీబీఐ షాకింగ్ విషయాలు వెల్లడి.. పోలీసులపై తీవ్ర ఆరోపణలు 
    మణిపూర్ అల్లర్లలో సీబీఐ షాకింగ్ విషయాలు వెల్లడి.. పోలీసులపై తీవ్ర ఆరోపణలు

    Manipur: మణిపూర్ అల్లర్లలో సీబీఐ షాకింగ్ విషయాలు వెల్లడి.. పోలీసులపై తీవ్ర ఆరోపణలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2024
    08:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో ఇద్దరు మహిళల న్యూడ్‌ పెరేడ్‌ కేసులో సీబీఐ కీలక విషయాలను బయటపెట్టింది.

    కుకీ-జోమి కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి మణిపూర్ పోలీసుల వద్దకు వస్తే వారిని పోలీసు సిబ్బందే అల్లరిమూకలకు అప్పగించినట్లు ఛార్జిషీటులో పేర్కొనింది.

    గుంపు మొదట వారిని వివస్త్రను చేసి,ఆపై మొత్తం గ్రామంలో ఊరేగించారు,అటు తరువాత వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడారు.

    ఈసంఘటన జరిగిన రెండు నెలల తర్వాత సోషల్ మీడియాలో కూడా వీడియో వైరల్ అయింది.

    బాధితురాళ్లు తమను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించాలని పోలీసులను కోరగా..'జీపు తాళాలు లేవు'అని వారు తప్పించుకున్నట్లు చెప్పుకొచ్చింది.అల్లరిమూకల చేతికి చిక్కిన మూడో మహిళ ఈ అఘాయిత్యం నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది.

    Details

    హెరోదాస్ మెయిటీతో పాటు మరో ఐదుగురిపై సీబీఐ చార్జిషీట్ 

    హుయిరేమ్ హెరోదాస్ మెయిటీతో పాటు మరో ఐదుగురిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

    ఓ బాల నేరస్థుడిపై గువాహటిలోని సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16వ తేదీన ఛార్జిషీటు దాఖలు చేసింది.

    జూలైలోనే హుయిరేమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విశేషమేమిటంటే ఆ ఇద్దరు మహిళల్లో ఒకరి భర్త అస్సాం రెజిమెంట్‌లో సుబేదార్‌గా పనిచేసినప్పటికీ కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు.

    ఈ ఘటన మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలోని బి గ్రామంలో చోటుచేసుకుంది.

    ఫెనోమ్ గ్రామపెద్ద ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వివిధ సంస్థలతో సంబంధం ఉన్న 900-1000 మంది బి. ఫెనోమ్ బలవంతంగా గ్రామంలోకి ప్రవేశించింది.

    Details

    అల్లరిమూకల చేతిలో మృతి చెందిన తండ్రీకొడుకులు

    వారి వద్ద AK-47 రైఫిల్స్, SL.R INSAS, 303 రైఫిల్స్ వంటి ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. హింసాత్మక గుంపు అన్ని ఇళ్లను ధ్వంసం చేసింది.

    ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత్రలు, బట్టలు, నగదుతో సహా ధాన్యాలు దోచుకున్న తర్వాత అన్ని స్థిర ఆస్తులకు నిప్పు పెట్టింది.

    ఈ దాడుల్లో కుకీ తెగకి చెందిన తండ్రీకొడుకులు అల్లరిమూకల చేతిలో మృతి చెందారు.

    వారి మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరు లేని నదిలోకి పడేసినట్లు చెప్పారు.

    మైతీ అల్లరిమూకలు పోలీస్ జీపు దగ్గరకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి పోలీసులు పారిపోయినట్లు సీబీఐ తన మూడు పేజీల ఛార్జిషీటులో వెల్లడించింది.

    పైగా సాయం చేయమని అర్థించిన ఓ మహిళను పోలీసులు తోసివేసినట్లు చెప్పుకొచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    సీబీఐ

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    మణిపూర్

    100 రోజల తర్వాత  మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ ముఖ్యమంత్రి
    మణిపూర్‌లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్  ఇంటర్నెట్
    మణిపూర్: 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత  భారతదేశం
    హింసాకాండ నేపథ్యంలో.. మణిపూర్‌ను 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించిన ప్రభుత్వం  భారతదేశం

    సీబీఐ

     వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్‌రెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రంకోర్టు  సుప్రీంకోర్టు
    దిల్లీ మద్యం పాలసీ కేసు: ఛార్జిషీట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చిన ఈడీ  దిల్లీ
     వైఎస్ వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చే పనిలో సీబీఐ  ఆంధ్రప్రదేశ్
    సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025