Page Loader
దిల్లీ లిక్కర్ పాలసీ: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ వాయిదా 
దిల్లీ లిక్కర్ పాలసీ: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ వాయిదా

దిల్లీ లిక్కర్ పాలసీ: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ వాయిదా 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2023
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెండు దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. సిసోడియా తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఈ అంశంపై వాదించేందుకు రెండు నుంచి మూడు గంటల సమయం కావాలని అడిగిన తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సీమాను మానవతా దృక్పథంతో కలుసుకునేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వైద్య నివేదికలను అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను వాయిదా వేసిన సుప్రీం కోర్టు