Page Loader
Manish Sisodia : ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకి జ్యుడీషియల్ కస్టడీ మే 30 వరకు పొడిగింపు 
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకి జ్యుడీషియల్ కస్టడీ మే 30 వరకు పొడిగింపు

Manish Sisodia : ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకి జ్యుడీషియల్ కస్టడీ మే 30 వరకు పొడిగింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2024
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. సిసోడియాతో పాటు ఇతర నిందితుల జ్యుడీషియల్ కస్టడీని మే 30 వరకు కోర్టు పొడిగించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో అభియోగాలపై వాదనలను కోర్టు మే 30కి వాయిదా వేసింది. మనీష్ సిసోడియాతో పాటు కస్టడీలో ఉన్న ఇతర నిందితులను జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఇక.. లిక్కర్‌ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గతేడాది మార్చి 9న మనీష్‌ సిసోడియాను అరెస్ట్‌ చేసింది. అనంతరం ఆయన తిహార్‌ జైలులో జ్యుడిషీయల్‌ కస్టడీపై ఉంటున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కస్టడీ మే 30 వరకు పొడిగింపు