Manish Sisodia: మనీష్ సిసోడియాకి స్వల్ప ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు
మద్యం పాలసీ స్కామ్‌లో జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. దిల్లీ కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లక్నోలో జరిగే తన మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు సిసోడియా ఫిబ్రవరి 12-16 మధ్య మధ్యంతర బెయిల్‌ను కోరారు. న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్.. సిసోడియాకు ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు బెయిల్‌ను మంజూరు చేశారు. మద్యంతర బెయిల్‌ను సీబీఐ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. సిసోడియా శక్తివంతమైన నాయకుడని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని కోర్టులో వాదించారు. అందుకే ఒకరోజు మాత్రమే అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును అభ్యర్థించింది. ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు.. సిసోడియాకు మూడు రోజుల పాటు అనుమతి ఇచ్చింది.