'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం
వ్రాసిన వారు
Stalin
Apr 29, 2023
03:58 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' ఆదివారం(ఏప్రిల్ 30) 100వ ఎపిసోడ్‌కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో 'మన్ కీ బాత్' మరో మైలురాయికి చేరుకోబోతున్న నేపథ్యంలో ప్రఖ్యాత సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఇసుకతో 100 రేడియోలతో ప్రధాని నరేంద్ర మోదీ శిల్పాన్ని రూపొందించారు. పట్నాయక్ సుమారు ఏడు టన్నుల ఇసుకను ఉపయోగించి 8 అడుగుల ఎత్తైన సైకత శిల్పాన్ని తయారు చేశారు. అక్టోబరు 3, 2014న 'మన్ కీ బాత్' తొలి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 30న 100వ ఎపిసోడ్‌లను పూర్తి చేసుకోనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి