
Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్ మైలురాయికి చేరుకుంది.
ఈ సందర్భంగా ఆదివారం(ఏప్రిల్ 30)న నిర్వహించిన 100వ ఎపిసోడ్‌ను న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. యూఎన్ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఛాంబర్‌లో కూడా మన్ కీ బాత్‌ను ప్రసారం చేశారు.
మన్ కీ బాత్ కార్యక్రమం 22 భారతీయ భాషలు, 29 మాండలికాలతో పాటు, ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియన్, టిబెటన్, బర్మీస్, బలూచి, అరబిక్, పష్టు, పర్షియన్, దరి, స్వాహిలితో సహా 11 విదేశీ భాషలలో ప్రసారమైంది.
'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్‌లో మోదీ చేసిన ప్రసంగంలో కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
మోదీ
'మన్ కీ బాత్' కారక్యక్రమం కాదు, ఆధ్యాత్మిక ప్రయాణం: మోదీ
మన్ కీ బాత్ అనేది మిలియన్ల మంది భారతీయుల భావోద్వేగాల వ్యక్తీకరణ అన్నారు ప్రధాని మోదీ.
తనకు సామాన్యులతో కనెక్ట్ అవ్వడానికి మన్ కీ బాత్ ఒక పరిష్కార మార్గాన్ని చూపిందన్నారు. ఇది కేవలం కార్యక్రమం కాదని, తనకు ఒక విశ్వాసం అని, ఆధ్యాత్మిక ప్రయాణమని పేర్కొన్నారు.
మన్ కీ బాత్‌లో లేవనెత్తిన అంశాలే ప్రజా ఉద్యమాలుగా మారాయని మోదీ వ్యాఖ్యానించారు. 'స్వచ్ఛ్ భారత్' అయినా, ఖాదీ అయినా, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' అయినా మన్ కీ బాత్‌నుంచి వచ్చినవే అని స్పష్టం చేశారు.
తనకు వేల ఉత్తరాలు వచ్చాయని, వాటిలో వీలైనన్ని ఎక్కువ చూడటానికి ప్రయత్నించినట్లు చెప్పారు. ప్రజలు రాసిన ఉత్తరాలు చదువుతున్నప్పుడు తాను ఉద్వేగానికి లోనైట్లు చెప్పారు.
మోదీ
సేవా దృక్పథంతో 'మన్ కీ బాత్' నిర్వహణ: మోదీ
మన్ కీ బాత్‌లోని ప్రతి ఎపిసోడ్‌లో భారతీయుడు ఇతర దేశస్థులకు స్ఫూర్తిగా నిలుస్తాడని మోదీ పేర్కొన్నారు.
మన్ కీ బాత్‌లోని ప్రతి ఎపిసోడ్ తదుపరి ఎపిసోడ్‌కు రంగం సిద్ధం చేస్తుందన్నారు. హర్యానాలో ప్రారంభించిన 'సెల్ఫీ విత్ డాటర్' గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహించడం నుంచి మేక్ ఇన్ ఇండియా, స్పేస్ స్టార్టప్‌ల వరకు విభిన్న రంగాల్లో ప్రతిభావంతులైన వ్యక్తుల కథలను 'మన్ కీ బాత్' ప్రదర్శించిందన్నారు.
'మన్ కీ బాత్' ఎల్లప్పుడూ సద్భావనతో, సేవాదృక్పథంతో, కర్తవ్య భావంతో ముందుకు సాగినట్లు మోదీ పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'మన్ కీ బాత్'ను విజయవంతం చేయడంపై మోదీ కృతజ్ఞతలు
PM @narendramodi expresses his gratitude to the entire AIR team, MyGov, media and especially the people of India for making 'Mann Ki Baat' a resounding success. #MannKiBaat100 pic.twitter.com/loWEYOwjH7
— PMO India (@PMOIndia) April 30, 2023