Ashwini Vaishnav: తెలంగాణకు మరెన్నో వంద్ భారత్ రైళ్లు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మరిన్ని వందే భారత్ రైళ్లు నడిపే ప్రణాళికలు ఉన్నాయని, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.
కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉండటంతో కొంత ఆలస్యమవుతోందని వివరించారు.
సోమవారం దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రధాన రైల్వే స్టేషన్లలో రక్షణ కోసం కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో మొత్తం 1,026 కిలోమీటర్ల మేర కవచ్ టెక్నాలజీ అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
Details
దేశవ్యాప్తంగా కవచ్ టెక్నాలజీ విస్తరణ
2026 నాటికి దేశవ్యాప్తంగా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి రానుందని, సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ప్రస్తుతం తెలంగాణ నుంచి ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, రాష్ట్రంలోని అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు.
పేద వర్గాల ప్రయాణ సౌలభ్యం కోసం నమో భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నామని, త్వరలో దేశవ్యాప్తంగా సుమారు 100 నమో భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.
ఈ రైళ్ల ద్వారా పేద ప్రజలు మరింత లబ్ధి పొందనున్నారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.