Amit Shah : 2026 కల్లా నక్సల్స్‌ను అంతం చేస్తాం : అమిత్ షా
మావోయిస్టుల హింస కారణంగా ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదముందని, నక్సల్స్ అంతానికి జరిగే చివరి పోరాటానికి బలమైక పకడ్బందీ వ్యూహం అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామన్నారు. దేశంలో ఇప్పటివరకూ 17వేల మందిని మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారన్నారు. నక్సల్స్ సమస్యపై శనివారం ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన సీనియర్ అధికారులతో అమిత్ షా అధ్యక్షతన అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
నక్సల్స్ ఆర్థిక మూలాలకు కూల్చవేతకు కృషి
ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. నక్సల్స్ లొంగుబాటుకు త్వరలో కొత్త విధానాలను ప్రవేశపెడతామన్నారు. 2014-24 మధ్యకాలంలో నక్సల్స్ సంబంధిత ఘటనల్లో 53 శాతం తగ్గుదల కనిపించిందన్నారు. ఎన్‌ఐఏ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు సైతం మావోయిస్టుల ఆర్థిక మూలాల కూల్చివేతకు తీవ్రంగా కృషి చేస్తాయని అమిత్ షా తెలిపారు.