తదుపరి వార్తా కథనం
Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడి.. పదిమంది జవాన్లు మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 06, 2025
03:29 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మరోసారి దారుణానికి పాల్పడ్డారు.
బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల వాహనాన్ని టార్గెట్ చేస్తూ మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం మరిన్ని భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.
అయితే ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.