
ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిపై మరాఠా కోటా నిరసనకారులు నిప్పు
ఈ వార్తాకథనం ఏంటి
మరాఠా కోటా సమస్యపై మళ్లీ హింస చెలరేగిన నేపథ్యంలో బీడ్ జిల్లాలో మహారాష్ట్ర ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిని ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి తగులబెట్టారు.
కోటా అనుకూల కార్యకర్త మనోజ్ పాటిల్ చేసిన నిరాహారదీక్షపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయన ఇంటి వెలుపల ఆగి ఉన్న వాహనంపై కూడా రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని సోలంకే తెలిపారు.
అదృష్టవశాత్తూ, నా కుటుంబ సభ్యులు,సిబ్బంది ఎవరూ గాయపడలేదు. మేమంతా క్షేమంగా ఉన్నాము, కానీ అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని ఆయన తెలిపినట్లు ANI పేర్కొంది.
Details
రిటైర్డ్ న్యాయమూర్తుల నేతృత్వంలో అడ్వైజరీ బోర్డు ఏర్పాటు
ANI షేర్ చేసిన విజువల్స్‌లో ఒక గుంపు రాళ్లు రువ్వడం,అనంతరం పెద్ద భవనానికి మంటలు అంటుకొని,భవనం నుండి పెద్ద ఎత్తున నల్లటి పొగలు వ్యాపించాయి.
సోలంకే పార్టీ అగ్నిప్రమాదాన్ని ఖండించింది.ఇది హోం మంత్రి పూర్తి వైఫల్యమని పేర్కొంది.
ఇది మహారాష్ట్రలో ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వ వైఫల్యమన్నారు.హోంమంత్రి ఏం చేస్తున్నారు?అది వారి బాధ్యత కాదా అని ఎన్సీపీ నేత సుప్రియా సూలే మండిపడ్డారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందిస్తూ..ఈ నిరసన తప్పుడు మార్గంలో వెళుతోందని.. మనోజ్ జైరాంగే పాటిల్ ఈ విషయాన్నీ గమనించాలన్నారు.
ఈ విషయాన్ని పరిశీలించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తుల నేతృత్వంలో తన ప్రభుత్వం అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేసిందని షిండే చెప్పిన తర్వాత రోజు ఈ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.