Bengaluru Fire Video: బెంగళూరు పబ్‌లో భారీ అగ్నిప్రమాదం
బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోని పబ్‌లో భవనంలోని నాల్గవ అంతస్తులో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. మడ్‌పైప్ హుక్కా కేఫ్‌లోని కిచెన్‌లో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది, కొద్దిసేపటికే మంటలు పబ్ మొత్తాన్ని చుట్టుముట్టాయని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదం నుండి కేఫ్ సిబ్బంది తప్పించుకున్నారు. చెలరేగుతున్న మంటల నుండి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో, నాల్గవ అంతస్తులో చిక్కుకున్న వ్యక్తి భవనంపై నుండి దూకాడు. అదృష్టవశాత్తూ అతను చెట్టుపై పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. మంటలు పక్కనే ఉన్న భవనాలకు వ్యాపించకుండా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అగ్నిప్రమాదంలో ఎనిమిది నుంచి పది ఎల్‌పీజీ సిలిండర్లు
పబ్‌లోని షీట్‌లు, ఇతర సామగ్రి పార్కింగ్ ఏరియాపై పడటంతో కొన్ని ద్విచక్ర వాహనాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. అగ్నిప్రమాదంలో ఎనిమిది నుంచి పది ఎల్‌పీజీ సిలిండర్లు పేలడంతో భవనం పూర్తిగా దెబ్బతిన్నట్లు అనుమానిస్తున్నారు.ఈ భవనంలో కార్ షోరూమ్ కూడా ఉంది. సద్దుగుంటెపాళ్యం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.