తదుపరి వార్తా కథనం

Karreguttalu: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 22 మంది మావోయిస్టుల మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 07, 2025
10:20 am
ఈ వార్తాకథనం ఏంటి
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలో కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతిచెందారు. అధికార వర్గాలు ఈ విషయం ప్రకటించాయి. ఘటన స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
ఈ ఆపరేషన్‌ను డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సీఏఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌ను ఏడీజీ వివేకానంద సిన్హా పర్యవేక్షిస్తున్నారు.
సీఆర్పీఎఫ్ ఐజీ రాకేశ్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందరరాజ్ ఆపరేషన్‌పై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.