LOADING...
Andhra Pradesh: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు…18 మంది మృతి
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు…నలుగురు దుర్మరణం

Andhra Pradesh: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు…18 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2026
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ బ్లాస్ట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఘటనలో 18 మంది మృతిచెందగా, మరికొంత మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మంటల్లో కొంత మంది కార్మికులు చిక్కుకుపోయారని సమాచారం లభిస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసుతున్నారు. ప్రమాద సమయంలో స్పాట్‌లో 20 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నారు.

Details

క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలింపు

స్థానికులు, అగ్నిమాపకశాఖ సిబ్బందితో కలిసి మంటలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడినవారిని వెంటనే అంబులెన్సుల ద్వారా సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాద సమయంలో కార్మికులు టపాసులు తయారు చేసుకుంటున్నారని, దీంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందని తెలుస్తోంది. పేలుడు శక్తి కారణంగా ఫ్యాక్టరీ పక్కన ఉన్న భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా చుట్టుపక్కల విస్తరించాయి. ప్రస్తుతానికి సహాయక చర్యలు పూర్తి శ్రద్ధతో కొనసాగుతున్నాయి, మరిన్ని వివరాలు వాస్తవ స్థితి ఆధారంగా తెలియనుంది.

Advertisement