
Explosion: తమిళనాడులో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 5 గదులు నేలమట్టం.. ఒకరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సత్తూరు సమీపంలోని హిందుస్థాన్ క్రాకర్ ఫ్యాక్టరీలో తీవ్రమైన పేలుడు సంభవించింది. ఈ పేలుడు ప్రభావంతో ఫ్యాక్టరీలోని 50 గదుల్లో 15 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, నలుగురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో పదుల సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన కార్మికులను అత్యవసరంగా శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Details
భయభ్రాంతులకు గురైన స్థానికులు
చుట్టుపక్కల ప్రాంతాలనంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదానికి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. భద్రతా ప్రమాణాలు పాటించకుండా పనిచేస్తున్న బాణసంచా ఫ్యాక్టరీలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.