LOADING...
Tamil Nadu: తమిళనాడులో ఘోర పేలుడు.. బాణాసంచా ఫ్యాక్టరీలో 17 మంది మృతి
తమిళనాడులో ఘోర పేలుడు.. బాణాసంచా ఫ్యాక్టరీలో 17 మంది మృతి

Tamil Nadu: తమిళనాడులో ఘోర పేలుడు.. బాణాసంచా ఫ్యాక్టరీలో 17 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 19, 2026
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. విరూద్‌నగర్ జిల్లాలోని కుట్టనార్‌పట్టి గ్రామంలో ఉన్న ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రత కారణంగా దాని ప్రభావం సుమారు 10 కిలోమీటర్ల పరిధి వరకు ప్రకంపనలు సృష్టించింది. ఘటన అనంతరం కర్మాగారంలో భారీగా మంటలు చెలరేగాయి. వాటిని అదుపు చేసేందుకు 5 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దించారు. మంటలు తీవ్రంగా ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

వివరాలు

పూర్తిగా కుప్పకూలిన భవనం

పేలుడు ధాటికి భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. శిథిలాల కింద మరికొందరి మృతదేహాలు చిక్కుకుపోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులను సిద్ధం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

Advertisement