తదుపరి వార్తా కథనం

అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం
వ్రాసిన వారు
Stalin
Apr 07, 2023
05:19 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఘోర ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని రవాణా కార్యాలయం సమీపంలోని ఒక దుకాణంలో భారీ పేలుడు సంభవంచింది.
ఈ ప్రమాదంలో ఒక్కరు ఒక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
మృతి చెందిన వ్యక్తిని సతీశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అనంతపురం
పేలుడు ధాటికి ముక్కలైన మృతదేహం
ప్రాంతీయ రవాణా కార్యాలయం సమీపంలోని వాహనాలకు పెయింటింగ్ వేసే దుకాణంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
దుకాణంలో పని చేసే సతీష్ పదేళ్ల క్రితం నాటి ఒక కెమికల్ డబ్బాను తెరుస్తుండగా, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు.
కెమికల్ డబ్బా తెరిచిన వెంటనే సతీష్ మృతదేహం ముక్కలు ముక్కలు అయినట్లు పోలీసులు తెలిపారు.