గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు
ఈ వార్తాకథనం ఏంటి
Dharmavaram-Gooty: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన రైల్వే లింకు ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. అనంతపురంలోని చిగిచెర్ల నుంచి ధర్మవరం మధ్య సెక్షన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణను విజయవంతంగా పూర్తి చేసింది. తాజా పనుల పూర్తితో గుత్తి నుంచి ధర్మవరం వరకు మొత్తం 90 కిలోమీటర్ల మేర ఇప్పుడు డబుల్ రైల్వే లైన్ విద్యుద్దీకరించబడింది. గుత్తి-ధర్మవరం రైల్వే లింకును దక్షిణాది రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు.
ఈ లైన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను బెంగుళూరుతో పాటు ఇతర రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన మార్గాలలో ఒకటిగా పనిచేస్తుంది.
రూ. 1,000 కోట్ల వ్యయతో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (ఆర్ఐటీఈఎస్) ఆధ్వర్యంలో 90 కిలోమీటర్ల మేర గుత్తి-ధర్మవరం ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు జరిగాయి.
గూటి-ధర్మవరం
దశలవారీగా గుత్తి-ధర్మవరం ప్రాజెక్టు పనులు
గుత్తి-ధర్మవరం ప్రాజెక్టు పనులను దశలవారీగా చేపట్టారు. 2019లో కల్లూరు-గార్లదిన్నె మధ్య 13 కిలోమీటర్లు, 2020లో చిగిచెర్ల- జంగాలపల్లె మధ్య 11కిలోమీటర్లు, గార్లదిన్నె-తాటిచెర్ల మధ్య 9కిలోమీటర్లు, 2022లో తాటిచెర్ల - జంగాలపల్లె మధ్య 19కిలోమీటర్లు, ఇప్పుడు 11కిలోమీటర్ల చివరి స్ట్రెచ్‌ను పూర్తి చేశారు. ఇలా పలు దశల్లో పనులను చేయడంతో ప్రాజెక్టు పూర్తయ్యింది.
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రైల్వే లైన్ ద్వారా రవాణా రద్దీని రద్దీని తగ్గిస్తుందని దక్షిణ మధ్య రైల్వే అంచనా వేస్తుంది. ఎక్కువ సంఖ్యలో ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లను నడపడానికి వీలు కల్పిస్తుంది. ఇది సెక్షన్‌లోని రైళ్ల సగటు వేగాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అలాగే మెరుగైన రైలు కనెక్టివిటీతో ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది.