Page Loader
India-Pakistan: శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. అప్రమత్తమైన ఆర్మీ
శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. అప్రమత్తమైన ఆర్మీ

India-Pakistan: శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. అప్రమత్తమైన ఆర్మీ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2025
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్ సిందూర్‌పై భారత్ చేసిన దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ దాడులకు దిగుతోంది. భారత సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా తీసుకుంటూ డ్రోన్లు, క్షిపణులతో వరుస దాడులు కొనసాగిస్తోంది. అయితే భారత సాయుధ బలగాలు ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ వరుస దాడులకు పాల్పడుతోంది. ఈ పరిణామాల్లో జమ్ముకశ్మీర్ వేసవి రాజధాని అయిన శ్రీనగర్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం 11:45 సమయంలో శ్రీనగర్ ఎయిర్‌పోర్టు సమీప ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని అధికారులు తెలిపారు.

Details

భయాందోళనలో ప్రజలు

ఈ శబ్ధాలతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యాపించింది. అక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనకు కొద్ది గంటల ముందే, అదే ప్రాంతంలో మరోసారి బాంబు పేలుళ్లు సంభవించాయని అధికారులు వెల్లడించారు. ఇవన్నీ శుక్రవారం రాత్రి పాక్ డ్రోన్ల దాడులను భారత సైన్యం విజయవంతంగా అడ్డుకున్న వెంటనే చోటుచేసుకోవడం గమనార్హం. పాకిస్థాన్ రెచ్చిపోయిన తరహాలో ఈ దాడులు కొనసాగుతుండగా, భారత భద్రతా బలగాలు మాత్రం అప్రమత్తంగా ప్రతిస్పందిస్తూ దేశ రక్షణకు కట్టుబడి ఉన్నాయన్నది స్పష్టమవుతోంది.