Page Loader
Kolkata Fire: కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. ఖిదిర్‌పూర్ మార్కెట్‌లో వెయ్యికిపైగా షాపులు దగ్దం
కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. ఖిదిర్‌పూర్ మార్కెట్‌లో వెయ్యికిపైగా షాపులు దగ్దం

Kolkata Fire: కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. ఖిదిర్‌పూర్ మార్కెట్‌లో వెయ్యికిపైగా షాపులు దగ్దం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఖిదిర్‌పూర్‌ ప్రాంతంలోని వ్యాపారిక గల వాణిజ్య మార్కెట్‌లో ఆదివారం అర్థరాత్రి తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాణిజ్య స్థలంగా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతంలో మంటలు పుట్టడంతో చుట్టుపక్కల ఉన్న దుకాణాలన్నీ మంటల్లో చిక్కుకున్నాయి. ముందుగా చిన్న స్థాయిలో ప్రారంభమైన మంటలు కొన్ని నిమిషాల్లోనే పెద్ద ఎత్తున వ్యాపించాయి. సమాచారం ప్రకారం.. ఈ అగ్నిప్రమాదంలో వెయ్యికిపైగా వ్యాపార దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రాంతంలోని వంటనూనె గోడౌన్లు, మట్టిపొడి, ప్లాస్టిక్, దుస్తులు వంటి తేలికపాటి మండే పదార్థాల వల్ల మంటలు వేగంగా విస్తరించాయని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

Details

రంగంలోకి దిగిన 20 ఫైర్ ఇంజిన్లు

ఘటనాస్థలానికి అత్యవసరంగా స్పందించిన అగ్నిమాపక సిబ్బంది 20కి పైగా ఫైర్ ఇంజిన్లతో రంగంలోకి దిగారు. రాత్రి, ఉదయం శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల మంటల్ని అదుపు చేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగినట్టు ఇప్పటి వరకు సమాచారం లేదు. అయితే ఆస్తినష్టం మాత్రం భారీగా సంభవించినట్టు అధికారులు చెబుతున్నారు. మంటలతో వ్యాపారుల దుకాణాలు పూర్తిగా నాశనమవడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లినట్టు అంచనా. కాగా అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా స్పందించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Details

ఘటనపై స్పందించిన ప్రభుత్వం

ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. రాష్ట్ర అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్ బసు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ఇది చాలా పెద్ద ప్రమాదం. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నష్టం అంచనా వేయడానికి కొంత సమయం పట్టవచ్చు. ప్రభుత్వం అన్ని విధాలుగా స్పందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.