
Compensation to Flood Victims: వరద బాధితులకు భారీ సాయం.. రూ. 602 కోట్ల జమ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద బాధితులకు గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ రోజు వరద బాధితుల ఖాతాల్లో సోమ్మును జమ చేశారు.
ఈ వరద బాధితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
సుమారు 4 లక్షల మందికి రూ. 602 కోట్లు బాధితుల అకౌంట్లలో డిపాజిట్ చేశామని ఆయన ప్రకటించారు.
ఇటీవల సంభవించిన ఈ విపత్తు అతిపెద్దదని, గతంలో ఇలాంటి విపత్తును తాను చూడలేదని సీఎం చంద్రబాబు తెలిపారు.
బుడమేరులో ఎన్నడూ లేనంత భారీ వరదలు, అలాగే కృష్ణా నదిలో కూడా భారీ వరదలు ఉధృతంగా వచ్చాయని అన్నారు.
Details
రూ. 400 కోట్ల విరాళాలు
ఇది ప్రకృతి ప్రకోపమే కాకుండా గత ప్రభుత్వ నిర్లక్ష్యం, బుడమేరును కబ్జా చేయడం వంటి చర్యల వల్ల ఈ విపత్తు తీవ్రతను పెంచాయని పేర్కొన్నారు.
1.15 కోట్ల ఫుడ్ ప్యాకెట్లు, 5 వేల క్వింటాళ్ల కూరగాయలు, 75 వేల ఇళ్ల శుభ్రత, 2.50 లక్షల కరెంట్ కనెక్షన్ల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. వరద బాధితుల కోసం రూ. 400 కోట్ల మేర విరాళాలు వచ్చినట్టు చంద్రబాబు తెలిపారు.
సుమారు రూ. 6700 కోట్ల నష్టం వాటిల్లగా, ప్రభుత్వం రూ. 602 కోట్ల మేర సాయమందిస్తోందని తెలిపారు.
16 జిల్లాల్లో వరద ప్రభావం ఉందని, అందరికీ సమానంగా సాయం అందించామని చెప్పారు.