Manoj Tiwari: బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఇంట్లో భారీ చోరీ.. రూ.5.40 లక్షలు మాయం!
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ నేత, దిల్లీ ఈశాన్య లోక్‌సభ ఎంపీ, ప్రముఖ గాయకుడు మనోజ్ తివారీ ఇంట్లో చోటు చేసుకుంది. శాస్త్రి నగర్ ప్రాంతంలోని సుందర్‌బన్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన సంభవించింది. మొత్తం రూ. 5.40లక్షల నగదు చోరీ అయిందని ఫిర్యాదు నమోదైంది ఈ చోరీకు సంబంధించి నిందితుడు బయట వ్యక్తి కాకుండా, మనోజ్ తివారీ ఇంట్లో గతంలో పనిచేసిన ఉద్యోగి అని తేలింది. మనోజ్ తివారీకి 20 సంవత్సరాలుగా మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రమోద్ జోగిందర్ అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడి పేరు సురేంద్రకుమార్ దీనానాథ్ శర్మ. ఇతడిని సుమారు రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారు.
Details
పోలీసుల అదుపులో నిందితుడు
అయితే, ఇంటి డూప్లికేట్ తాళాలు అతడి వద్ద ఉండటంతో అవకాశాన్ని ఉపయోగించి చోరీకి పాల్పడ్డాడు. పోలీసులు వివరించారు, ఈ చోరీ ఒక్కరోజులో జరగలేదు. జూన్ 2025లో బెడ్‌రూమ్‌లోని అల్మారాలో 4.40 లక్షల రూపాయలు మాయమయ్యాయి. అప్పటికి నిందితుడు ఎవరు అనేది తెలియలేదు. అనుమానంతో డిసెంబర్ 2025లో ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 2026 జనవరి 15 రాత్రి 9 గంటలకు సీసీటీవీ అలర్ట్ వచ్చింది. ఫుటేజ్‌లో సురేంద్రకుమార్ ఇంట్లో చోరీ చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. సీసీటీవీ ఆధారాలతో విచారించినప్పుడు, అతడు తన తప్పును ఒప్పుకున్నాడు. వెంటనే అంబోలి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.