LOADING...
Operation Mahadev: మాస్టర్మైండ్ హషిమ్ ముస్సా హతం.. 'ఆపరేషన్ మహాదేవ్' విజయవంతం!
మాస్టర్మైండ్ హషిమ్ ముస్సా హతం.. 'ఆపరేషన్ మహాదేవ్' విజయవంతం!

Operation Mahadev: మాస్టర్మైండ్ హషిమ్ ముస్సా హతం.. 'ఆపరేషన్ మహాదేవ్' విజయవంతం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2025
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు మరోసారి ఉగ్రవాదంపై ఘాటు ఎదురు దాడికి దిగాయి. ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసు శాఖ, సీఆర్‌పీఎఫ్ (CRPF) సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ మహాదేవ్' విజయవంతమైంది. సోమవారం ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ దాడి చినార్ కార్ప్స్ ఆధ్వర్యంలో లిడ్‌వాస్ ప్రాంతంలో కొనసాగింది.

Details

 పల్గామ్ దాడికి బాధ్యుడైన హషిమ్ ముస్సా హతం

హతమైన వారిలో సులేమాన్ షా అలియాస్ హషిమ్ ముస్సా అనే లష్కరే తోయ్బా టాప్ కమాండర్ ఉన్నాడు. ఇతనే గతంలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి మాస్టర్మైండ్. అతడి అరెస్టుకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి ఆనంతనాగ్ పోలీసులు రూ.20 లక్షల బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా కొనసాగిన ఆపరేషన్ ఈ ఆపరేషన్ రెండు రోజులుగా కొనసాగింది. డచిగామ్ అడవుల్లో అనుమానాస్పద కమ్యూనికేషన్ ట్రేస్ కావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అక్కడి లోకల్ నొమాడ్లు (గిరిజనులు) కూడా విలువైన సమాచారాన్ని అందించారు. వారి సూచనలతో ఉగ్రవాదుల స్థానాన్ని గుర్తించగలిగారు.

Details

మరణించిన వారిలో మరో ఇద్దరు గుర్తింపు

ఈ ఎదురుకాల్పుల్లో మరణించిన మరో ఇద్దరు ఉగ్రవాదులు అబూ హంసా, యాసిర్‌గా గుర్తించారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు వీరంతా లష్కరే తోయ్బా (LeT), జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్ర మాడ్యూల్‌కు చెందినవారుగా భావిస్తున్నారు. ఈ మాడ్యూల్‌పై భద్రతా బలగాలు గత కొన్ని రోజులుగా నిఘా పెట్టినట్టు తెలిసింది. ఈ మాడ్యూల్‌లో మొత్తం 5 నుంచి 7 మంది ఉగ్రవాదులు ఉన్నట్టు అంచనా. భద్రతా బలగాలకు భారీ విజయం ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తవడంతో ఉగ్రవాద శిబిరాల్లో కుదుపు రాగా, భద్రతా బలగాలు మరింత మౌలిక సమాచారాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. స్థానికంగా భద్రతా ఏర్పాట్లను బలపరిచారు.