
Raj-Uddhav Reunite: రాజకీయ శత్రువుల కలయిక.. పెళ్లి వేడుకల్లో కలుసుకున్న రాజ్-ఉద్ధవ్ ఠాక్రే
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాజకీయాల్లో బద్ద శత్రువులైన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల ముంబైలో జరిగిన ఒక వివాహ వేడుకలో కలుసుకున్నారు.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే సోదరి కుమారుడి వివాహం దాదర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా తన కుటుంబంతో హాజరయ్యారు.
పెళ్లి వేడుక సందర్భంగా రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే తమ మేనల్లుడికి అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.
ఈ సన్నివేశం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వారి రాజకీయ విభేదాల నేపథ్యంలో ఈ కలయిక ప్రజలలో ఆసక్తిని రేకెత్తించింది.
Details
ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న అభిమానులు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరి పార్టీలూ మెరుగైన ఫలితాలు సాధించలేకపోయాయి. శివసేన (యూబీటీ) మాత్రం 20 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
ఆసక్తికరంగా, మహారాష్ట్ర రాజకీయాల్లో పరస్పర విమర్శలు చేసుకునే ఈ ఇద్దరు నేతలు పెళ్లి వేడుకలో కలుసుకోవడం, పరస్పరం మాట్లాడుకోవడం వారి అనుచరులు, ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది.
వీడియో వైరల్ కావడం వల్ల ప్రజలు ఈ ఇద్దరు సోదరుల భవిష్యత్ రాజకీయ తీరు గురించి చర్చించుకుంటున్నారు.
ఈ కలయిక ఒక దశాబ్దంగా కొనసాగుతున్న రాజకీయ విభేదాలపై కొత్త ఆశలను రేకెత్తించిందా? లేక ఇది కేవలం ఒక ఆత్మీయ సందర్భానికే పరిమితమైందా? అనేది తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Mumbai: MNS president Raj Thackeray and Shiv Sena (UBT) chief Uddhav Thackeray were seen together at the wedding of Raj Thackeray's sister Jaywanti Thackeray-Deshpande's son in Dadar. The two were also seen conversing, and both families were present at the ceremony pic.twitter.com/cGfADDSs8X
— IANS (@ians_india) December 22, 2024