AP Mega Dsc-2024: ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా.. ఎందుకంటే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ-2024 ప్రకటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. సోమవారం టెట్ ఫలితాలు ఆన్‌లైన్‌లో విడుదల చేసినప్పటికీ, రెండు రోజుల వ్యవధిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించిన అభ్యంతరాలు కారణంగా నోటిఫికేషన్ విడుదలను ఆపివేసినట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీఎస్ సంస్థ ఎస్సీ వర్గీకరణను అమలు చేసే వరకు ప్రభుత్వ నియామకాలపై నోటిఫికేషన్ ఇవ్వకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
సీఎం చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ భేటీ
రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేయడంతో, మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడుతో మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగింది పోస్టుల వివరాలు మెగా డీఎస్సీ-2024లో మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) 6,371, స్కూల్ అసిస్టెంట్లు (SA) 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGT) 1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (PGT) 286, ప్రిన్సిపాల్స్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు (PET) 132 పోస్టులు ఉన్నాయి.