LOADING...
Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల.. జూన్ 6 నుంచి పరీక్షలు
ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల.. జూన్ 6 నుంచి పరీక్షలు

Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల.. జూన్ 6 నుంచి పరీక్షలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో మెగా డీఎస్సీ (AP Mega DSC) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 6 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. గతంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన 16,347 పోస్టులకు డీఎస్సీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా దరఖాస్తులొచ్చాయి. మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు అప్లై చేశారు.

Details

అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన విద్యాశాఖ

అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఎంపిక చేసిన ఐచ్ఛిక కేంద్రాల ఆధారంగా ఎక్కువ మందికి ఆప్రకారమే పరీక్ష కేంద్రాలను కేటాయించారు. విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్టు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణకు అవసరమైన సాంకేతిక, భౌతిక సదుపాయాల ఏర్పాటును కూడా పూర్తి చేస్తోంది.