LOADING...
Heavy Rains: తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

Heavy Rains: తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 12, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌తో పాటు జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలతో, బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు మరికొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాఖ హెచ్చరించింది.

Details

పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ

ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి. సోమవారం రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో 6.6 సెం.మీ., గుడిపల్లి మండలంలో 6.5 సెం.మీ., రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం తాళ్లపల్లిలో 6.4 సెం.మీ.గా నమోదైంది. అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, జనగామ, వరంగల్, నిర్మల్, కరీంనగర్‌ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.