LOADING...
Mumbai: ముంబైలో కూలిన మెట్రో పిల్లర్.. నలుగురికి గాయాలు
ముంబైలో కూలిన మెట్రో పిల్లర్.. నలుగురికి గాయాలు

Mumbai: ముంబైలో కూలిన మెట్రో పిల్లర్.. నలుగురికి గాయాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2026
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై నగరంలోని ములాద్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో రైలుకు సంబంధించిన ఒక పిల్లర్ కూలిపోవడంతో తీవ్ర ప్రమాదం సంభవించింది. రద్దీ సమయంలో ఈ ఘటన జరగడంతో పలువురు గాయపడ్డారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సబ్‌వే స్లాబ్ కూలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బీఎంసీ వెల్లడించిన వివరాల ప్రకారం, శనివారం మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో ములుండ్ (పశ్చిమ)లోని జాన్సన్ & జాన్సన్ కంపెనీ సమీపంలో ఈ ఘటన జరిగింది.

Details

ఆటోరిక్షాలో ఉన్నవారికి గాయాలు

నిర్మాణ పనుల సమయంలో సిమెంట్ మెట్రో పిల్లర్ భాగం విరిగి ఒక ఆటోరిక్షాపై పడినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, మెట్రో సిబ్బంది, వార్డ్ సిబ్బంది, అలాగే 108 అంబులెన్స్ సేవలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆటోరిక్షాలో ఉన్న నలుగురు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం.

Advertisement