తదుపరి వార్తా కథనం
Hyderabad: హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలకు మెట్రో సేవలు పొడిగింపు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 31, 2024
11:51 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ దేశాలు కొత్త సంవత్సరం వేడుకలకు సిద్దమవుతున్నాయి. ఈ సందర్భంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 31 నాడు అర్దరాత్రి వరకు మెట్రో ట్రైన్స్ సేవలు కొనసాగనున్నాయి.
నూతన సంవత్సర సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లకు రవాణా సమస్యలు లేకుండా సురక్షితంగా చేరుకోవాలని కోరుతూ, ఎల్ అండ్ టీ మెట్రో ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని తెలిపింది.
హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకలు జరుగనున్నందున, ప్రజలు గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేందుకు మెట్రో సేవలను పొడిగించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.