Page Loader
Bomb Blast : అర్ధరాత్రి మహబూబాబాద్‌లో బాంబ్ బ్లాస్టింగ్..25ఇళ్లకుపైగా బీటలు, గ్రామస్తుల ఆందోళన
అర్ధరాత్రి మహబూబాబాద్‌లో బాంబ్ బ్లాస్టింగ్..25ఇళ్లకుపైగా బీటలు, గ్రామస్తుల ఆందోళన

Bomb Blast : అర్ధరాత్రి మహబూబాబాద్‌లో బాంబ్ బ్లాస్టింగ్..25ఇళ్లకుపైగా బీటలు, గ్రామస్తుల ఆందోళన

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 21, 2023
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో భారీ బాంబ్ బ్లాస్టింగ్ కలకలం సృష్టించింది. బుధవారం అర్ధరాత్రి ఓ స్టోన్ క్రషర్‌లో జరిగిన పేలుడుతో గ్రామ శివారుకు సమీపంలోని ఇళ్ల గోడలకు బీటలు వారాయి. బాంబు పేలుళ్ల శబ్దానికి భయబ్రాంతులకు గురైన స్థానిక ప్రజలు ఇళ్లనుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ ఘటనతో షాక్'కు గురైన గ్రామస్తులు, అప్పటికప్పుడే స్టోన్ క్రషర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. ఇదే సమయంలో రిజిస్ట్రేషన్ మేరకు అక్కడ క్రషర్ స్టోన్ ఉందని యాజమాన్యం చెబుతోంది. గూడూరు మండలం పొనుగోడు గ్రామ శివారులో రేణుక స్టోన్ క్రషర్‌ ఉంది. తమ గ్రామానికి ప్రమాదం జరుగుతుందని రేణుక క్రషర్‌ యాజమాన్యాన్ని గాజులగట్టు గ్రామస్తులు ఎప్పట్నుంచో అడ్డుకుంటూ వస్తున్నారు.

details

భీతిల్లిన ప్రయాణికులు

అయినా రేణుక స్టోన్ క్రషర్‌ యాజమాన్యం గ్రామస్తుల మాటను పెడచెవిన పెట్టింది. ఈ క్రమంలోనే ఇష్టారీతిన తమ పని చేసుకుంటూపోయారు.ఈ నేపథ్యంలోనే బుధవారం అర్ధరాత్రి స్టోన్ క్రషర్‌లో బాంబ్ బ్లాస్టింగ్‌ ఏర్పడింది. భారీ పేలుళ్లకు గాజులగట్టు గ్రామంలోని ఇళ్ల గోడలకు బీటలు వారాయి. భారీ బండారాళ్లకు ప్రధాన రహదారులకు గుంతలు ఏర్పడ్డాయి. మిర్చి, పత్తి, మొక్కజొన్న పంట పొలాల్లోనూ భారీ బండారాళ్లు ఎగిరి పడి పంట నష్టం జరిగింది. నెక్కొండ రహదారి పక్కనే క్రషర్ పేలుళ్లు జరగడంతో ప్రయాణికులు భీతిల్లారు. పేలుడుతో ధూళి, దుమ్ముతో గాజులగట్టు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. అర్ధరాత్రి క్రషర్ వద్ద గాజులగట్టు గ్రామస్తులు ఆందోళనకు దిగి అనంతరం పోలీసులను ఆశ్రయించారు.