తదుపరి వార్తా కథనం
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 05, 2025
10:03 am
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి.
నారాయణ్‌పూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులోని దండకారణ్య అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఎన్‌కౌంటర్ జరిగింది.
ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని అధికారులు వెల్లడించారు.
అబుజ్‌మాద్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Details
వీరమరణం పొందిన కానిస్టేబుల్
భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపగా, ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో దంతెవాడ డీఆర్‌జీ హెడ్ కానిస్టేబుల్ కరమ్ మావోయిస్టుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని వారు ప్రకటించారు.