Telangana Weather: రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
ఆవర్తనం,ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ)ప్రకటించింది. ఉరుములు,మెరుపులు,ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఆ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.శుక్రవారం, శనివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల,పెద్దపల్లి,మహబూబ్‌నగర్,నాగర్ కర్నూల్,వనపర్తి,నారాయణ పేట,జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శనివారం వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. హైదరాబాద్ లో,ఈరోజు మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులతో సాధారణంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుందని అంచనా వేసింది.